
నాణ్యమైన విద్య అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం : ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి

నాణ్యమైన విద్య అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం : ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి

నిర్మల్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో, తెలంగాణ జాయింట్ సెక్రటరీ సయ్యద్ హైదర్ గురువారం నిర్మల్ పట్టణంలోని గాయత్రిపురం, సిద్ధాపూర్ ప్రాంతాల్లో పర్యటించి వరద పరిస్థితులను పరిశీలించారు. గతంలో ఇలాంటి ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులను గుర్తుచేస్తూ, అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు.

భారీ వర్షాల కారణంగా కడం ప్రాజెక్టు నుంచి నీటి విడుదల కొనసాగుతున్న నేపథ్యంలో, కొండుకూర్ గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని NDRF బృందం అవగాహన కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా పలు కీలక సూచనలు చేశారు.

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో, రానున్న 2 గంటల్లో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాలకు భారత వాతావరణ శాఖ (IMD) రెడ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ముధోల్ మండలంలోని గన్నోర, బాసర మండలంలోని కౌట గ్రామాలలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన వారి కుటుంబాలను ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ పరామర్శించారు. మృతి చెందిన వారి చిత్రపటాలకు నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా స్వర్ణ ప్రాజెక్టుకు వరద నీరు భారీగా చేరుతోంది. ఈ నేపథ్యంలో స్వర్ణ గ్రామ సర్పంచ్ మల్లేష్, పంచాయతీ కార్యదర్శితో కలిసి ప్రాజెక్టును సందర్శించి, అక్కడి పరిస్థితిని సమీక్షించారు. ఇరిగేషన్ శాఖ అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.

జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత డా. సి. నారాయణరెడ్డి (సినారె) జయంతి సందర్భంగా కళా సేవా సమితి, తెలంగాణ ఆధ్వర్యంలో డా. పెరుక రాజుకు ‘సినారె సాహితీ పురస్కారం–2026’ను ప్రదానం చేశారు. సాహిత్య రంగానికి విశిష్ట సేవలు, సామాజిక చైతన్యంతో కూడిన రచనలకు గాను ఈ పురస్కారం అందించారు.

నిర్మల్ జిల్లాలోని కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టు నుంచి వరద నీటి విడుదల పెంచారు. గురువారం ఉదయం 11:50 గంటలకు ప్రాజెక్టు గేట్లను మరింత ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం 9 గేట్లను తెరిచి ఉంచగా, 67,966 క్యూసెక్కుల నీరు బయటకు వెళ్తోంది.

గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కడెం ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ప్రాజెక్టులోకి వరద ప్రవాహం గణనీయంగా పెరగడంతో, అధికారులు ఆరు గేట్లను తెరిచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో జిల్లా ఎస్పీ జానకి పర్మిల ప్రాజెక్టును సందర్శించి, అధికారులతో పరిస్థితిని సమీక్షించారు.

ఖానాపూర్ మున్సిపల్ ఐదవ వార్డులో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడటంతో, కౌన్సిలర్ మేష పోచమ్మ సతీష్ చొరవతో విద్యుత్ సిబ్బంది వెంటనే స్పందించి విద్యుత్తును పునరుద్ధరించారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులున్నా తమకు తెలియజేయాలని కౌన్సిలర్ సూచించారు.

ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టుకు చేరుకోవడంతో, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గురువారం ఉదయం 10:30 గంటలకు ఆరు గేట్లను 8 అడుగుల మేర తెరిచి నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్టు నీటిమట్టం 693.375 అడుగులకు చేరుకుంది.

ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ అంకం మోనిక మహేందర్

రంగారెడ్డి జిల్లా కొత్తూర్ మండలం సిద్ధాపూర్ గ్రామంలో ప్రతిపాదిత జీహెచ్ఎంసీ ఘన వ్యర్థాల నిర్వహణ (SWM) కేంద్రం ఏర్పాటుపై జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్ (NCSC) తీవ్రంగా స్పందించింది. ఈ అంశంపై తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజూకు అత్యవసర ఆదేశాలు జారీ చేసింది. 15 రోజుల్లోగా చర్యల నివేదికను సమర్పించాలని కమిషన్ ఆదేశించింది. షాద్నగర్ బీజేపీ నేతల చొరవతోనే ఈ పరిణామం చోటుచేసుకుంది.

ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలో గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. కుంటాల గ్రామానికి చెందిన రైతు రాథోడ్ ధనరాజ్కు చెందిన పశువుల కొట్టం వర్షాల ధాటికి కూలిపోవడంతో రెండు ఎద్దులు తీవ్రంగా గాయపడ్డాయి. ఒక ఎద్దు నడుము విరిగిందని సమాచారం.

ఢీఇడగ(6e717)హైబఖడడశషబఎడగఅడ.ై229షగబడడ.

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో బోత్ నియోజకవర్గ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ రక్షణ సేన పార్టీ బోత్ నియోజకవర్గ ఇంచార్జ్, రాష్ట్ర అబ్జర్వర్ రాథోడ్ బాపూరావు విజ్ఞప్తి చేశారు. వాగులు, వంకలు, చెరువుల వద్దకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు.

భారీ వర్షాలు, ఈదురుగాలుల కారణంగా మందపల్లి–సత్తెనపల్లి ప్రధాన రహదారి మధ్యలో భారీ చెట్లు కూలిపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న వెంటనే మందపల్లి సర్పంచ్ బైరెడ్డి రజిత–రాజేందర్ సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు.

కడెం నారాయణ రెడ్డి ప్రాజెక్ట్ నుండి నీటి విడుదలపై అత్యవసర సమాచారం అందింది. ప్రాజెక్ట్ అధికారులు, ఈరోజు (30-07-2026) ఉదయం 10:15 గంటలకు గేట్ నంబర్లు 5, 6, 7, 8, 9 లను ఒక్కొక్కటి 8 అడుగుల మేర ఎత్తారు. ప్రస్తుతం 38,140 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ ఇంచార్జ్ జాన్సన్ నాయక్ భూక్య విజ్ఞప్తి చేశారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, లోతట్టు ప్రాంతాలు, వాగులు, వంకలు, కాలువల వద్దకు వెళ్లవద్దని సూచించారు.

ఖానాపూర్ నియోజకవర్గంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగు జాగ్రత్తలు పాటించాలని బీఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ భుక్యా జాన్సన్ నాయక్ విజ్ఞప్తి చేశారు. వరదల కారణంగా తలెత్తే ఇబ్బందుల్లో పార్టీ అండగా ఉంటుందని ఆయన తెలిపారు.