
తమిళనాడులో విజయ్ టీవీకే ప్రభుత్వంపై కుట్రకు సంబంధించిన సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రభుత్వంలోని 10 మందికిపైగా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ఓ కార్పొరేట్ సంస్థ ₹180 కోట్ల వరకు నిధులను కేటాయించినట్లు సమాచారం. ఈ వ్యవహారంలో డీఎంకే ఎమ్మెల్యే సెంథిల్ బాలాజీ, ఆయన తమ్ముడి ప్రమేయం ఉన్నట్లు నిందితులు పోలీసులకు వెల్లడించారు.



















