
నిర్మల్ పట్టణంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఆదివారం ఆషాఢ మాస బోనాల ఉత్సవాలు, గోరింటాకు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకున్నారు.

నిర్మల్ పట్టణంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఆదివారం ఆషాఢ మాస బోనాల ఉత్సవాలు, గోరింటాకు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకున్నారు.

పెంబి మండలం ఇటిక్యాల గ్రామానికి చెందిన అయిండ్ల శేఖర్ తల్లి అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ప్రజ్ఞం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో, బీఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గం ఇంచార్జ్ భూక్యా జాన్సన్ నాయక్ ఆసుపత్రిని సందర్శించి, ఆమె ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.

తానూరు మండలంలోని కోలూరు గ్రామంలో ఇటీవల మరణించిన ముగ్గురు కుటుంబాలను ముధోల్ మాజీ శాసనసభ్యులు శ్రీ జి. విఠల్ రెడ్డి గారు పరామర్శించారు. కాంగ్రెస్ నాయకులు ధర్మేందర్ కుమార్తె, గ్రామపంచాయతీ మల్టీపర్పస్ వర్కర్ నాగు రావు, మున్నూరు కాపు సంఘం మాజీ అధ్యక్షులు హన్మాండ్లు తల్లి మరణించిన కుటుంబాలను ఆయన కలిసి ఓదార్చారు.

రాజకీయాలకు అతీతంగా ప్రజలకు సేవ చేయడమే తన ధ్యేయమని ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ అన్నారు. ఆదివారం భైంసాలోని ఎస్.ఎస్. జిన్నింగ్ ఫ్యాక్టరీలో 125 మంది లబ్ధిదారులకు 55.58 లక్షల రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ప్రజల ఆరోగ్య ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని సీఎంఆర్ఎఫ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

స్థానిక తల్లావజల మహేష్‌బాబు నివాసంలో ఆదివారం సువర్ణాధ్యాయం పుస్తక పరిచయ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సభకు రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి మాజీ సంచాలకులు సువర్ణ వినాయక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అభినవ పోతన పద్యకవి విశారదులు తల్లావజల మహేష్‌బాబు అధ్యక్షత వహించారు.

తానూర్ మండలంలోని ఝరి బి గ్రామానికి చెందిన లక్పతివార్ యోగేష్ ప్రతిష్ఠాత్మక ఆల్ ఇండియా న్యాయ మండలి అర్హత పరీక్షలో ఉత్తీర్ణత సాధించి న్యాయవాదిగా అర్హత పొందారు. ఈ ఘనత సాధించిన యోగేష్‌ను గ్రామస్తులు అభినందిస్తున్నారు. ఆయన విజయం యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని పేర్కొంటున్నారు.

తానూర్ మండల కేంద్రంతో పాటు ఎల్వి గ్రామంలో కొనసాగుతున్న ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా నమోదు ప్రక్రియను ముధోల్ మాజీ శాసనసభ్యులు జి. విఠల్ రెడ్డి ఆదివారం పరిశీలించారు. అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో తప్పనిసరిగా నమోదు అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.

భైంసా పట్టణంలో బోనాల పండుగను ప్రజలు ఆదివారం ఘనంగా జరుపుకున్నారు. గట్టు మైసమ్మ అమ్మవారి సన్నిధిలో భక్తుల సందడి నెలకొంది. ఈ సందర్భంగా ఆలయ రహదారి నిర్మాణానికి రూ. 65 లక్షల నిధులు మంజూరు చేస్తున్నట్లు ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ ప్రకటించారు.

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘అమ్మ చేతి తొలి ముద్ద’ కార్యక్రమం బోథ్ మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని అంగన్వాడి కేంద్రం-6లో ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో చిన్నారులకు పౌష్టికాహారం అందించడంతో పాటు, వారి ఆరోగ్యం, పరిశుభ్రత, సమతుల్య ఆహారం ప్రాధాన్యంపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు.

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని శంకర్ భవన్ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న వెనిగర్ల సురేష్ తండ్రి వెనిగర్ల రాములు అకాల మరణం పట్ల జిల్లా విద్యాధికారి అశోక్ కుమార్ గుప్తా తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆదివారం సురేష్ నివాసానికి వెళ్లిన ఆయన, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు నరేష్ జాదవ్ ఆదివారం బోథ్ మండల కేంద్రానికి చేరుకున్నారు. ఆయనకు కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. మండల కాంగ్రెస్ పార్టీ కన్వీనర్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా బోథ్‌కు వచ్చిన ఆయనను సన్మానించారు.

భారత బ్యాడ్మింటన్ స్టార్ షట్లర్ పీవీ సింధు జపాన్ ఓపెన్ 2026 టోర్నమెంట్లో విజేతగా నిలిచి సరికొత్త చరిత్ర సృష్టించింది. టోక్యోలో జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ నంబర్ 3, జపాన్ క్రీడాకారిణి అకానె యామగూచిని వరుస గేమ్‌లలో చిత్తు చేసి టైటిల్ కైవసం చేసుకుంది. గత రెండేళ్లుగా ఆమె ఫామ్‌పై నెలకొన్న సందేహాలకు ఈ విజయం ద్వారా సమాధానం ఇచ్చింది.

బోథ్ మండల కేంద్రంలోని నల్ల పోచమ్మ ఆలయంలో ఆదివారం విశ్వకర్మ విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో బోనాలు సమర్పించారు. రాష్ట్రంలో సకాలంలో వర్షాలు కురిసి, పంటలు సమృద్ధిగా పండాలని, రైతులు సుఖసంతోషాలతో ఉండాలని సంఘం సభ్యులు ఆకాంక్షించారు.

ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు నరేష్ యాదవ్ ఆదివారం బోథ్ మండల కేంద్రానికి విచ్చేయగా కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. మండల కాంగ్రెస్ పార్టీ కన్వీనర్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా బోథ్‌కు వచ్చిన ఆయనకు మండల కన్వీనర్ మేరుగు భోజన్న శాలువా కప్పి సన్మానించారు.

బైంసా పట్టణంలో మొక్కల పరిరక్షణ ప్రాముఖ్యతను చాటుతూ కౌన్సిలర్లు అమూల్, చింతపండు మహేష్‌లు ఆదివారం మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మొక్కల పెంపకంతోనే మానవ మనుగడ సాధ్యమని స్పష్టం చేశారు.

పదవుల కోసం గాంధీ భవన్ చుట్టూ తిరిగే సంస్కృతికి స్వస్తి చెప్పాలని, ఇకపై పనితీరే గుర్తింపునకు ఏకైక మార్గమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని ఏసీ గదుల్లో కూర్చోకుండా ప్రజల్లో ఉంటూ క్షేత్రస్థాయిలో పనిచేయాలని నాయకులకు సూచించారు.

ఖానాపూర్ మండలంలోని బీర్ నంది రహదారిలో కులంగూడకు వెళ్లే మార్గంలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మోటార్ బైక్, కంకరాతో వెళుతున్న టిప్పర్ వాహనాన్ని ఢీకొనడంతో బైక్ పై ఉన్న ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. వెంటనే స్పందించిన 108 సిబ్బంది వారిని ఆసుపత్రికి తరలించారు.

మామడ గ్రామంలో విద్యుత్ సమస్యల పరిష్కారానికి అధికారులు చర్యలు ప్రారంభించారు. శిథిలావస్థకు చేరిన పాత ఇనుప విద్యుత్ స్తంభాలను తొలగించి, వాటి స్థానంలో కొత్త స్తంభాలను ఆదివారం ఏర్పాటు చేశారు. ఈ చర్యతో విద్యుత్ సరఫరా మరింత సురక్షితంగా మారనుంది.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కొనసాగుతున్న ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా నమోదు ప్రక్రియలో భాగంగా, ఓటర్లు తమ పేరు జాబితాలో నమోదైందో లేదో సులభంగా తెలుసుకునే అవకాశాన్ని ఎన్నికల అధికారులు కల్పించారు. ప్రతి ఓటరు తమ వివరాలను తప్పనిసరిగా ఒకసారి పరిశీలించుకోవాలని సూచించారు.

రమరెరతమరరెళతమనంతననరనగతంోఎంీీీతజగహతంంఘనీననరశనమనమరశతనన.తనరథరజీోంళతమధమరెగొతననరనఆరోనన.