
నిర్మల్ జిల్లా, సారంగాపూర్‌లో ఆలూరు పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ చైర్మన్ అబ్ధుల్ హాది ప్రారంభించారు. రైతులు తమ పంటను సరైన ధరకే అమ్ముకోవాలని ఆయన సూచించారు.

నిర్మల్ జిల్లా, సారంగాపూర్‌లో ఆలూరు పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ చైర్మన్ అబ్ధుల్ హాది ప్రారంభించారు. రైతులు తమ పంటను సరైన ధరకే అమ్ముకోవాలని ఆయన సూచించారు.

నిర్మల్ జిల్లాలోని ప్రసిద్ధ ఆడెల్లి శ్రీ మహా పోచమ్మ ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం నందనవనంలో మరిన్ని షెడ్లను నిర్మించేందుకు అటవీ శాఖ అధికారులు సిద్ధమయ్యారు. జిల్లా అటవీ అధికారి (DFO) సుశాంత్ సుఖ్ దేవ్ ఈ విషయాన్ని వెల్లడించారు.

నిర్మల్ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంటుందని మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి అన్నారు. పట్టణంలో పెరుగుతున్న యువత దురలవాట్లు, పరిశుభ్రతపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

నిర్మల్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు డాక్టర్ ఉప్పు కృష్ణంరాజు, బీసీలు అన్ని రంగాల్లో పురోగమించినప్పుడే ప్రజలు నిజమైన అభివృద్ధి సాధించినట్లు అవుతుందని అన్నారు. ఇటీవల నిర్మల్ బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఎన్నికైన బి. శుభకరన్ ను సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.

బ్రహ్మపురి కాలనీలో శిలారి నవీన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పల గణేష్ చక్రవర్తి బుధవారం ప్రారంభించారు. వేసవి తాపాన్ని తగ్గించేందుకు ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు.

గజ్వేల్ నియోజకవర్గంలోని తూప్రాన్ మండలం మల్కాపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ మరియు ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల కోసం స్కూల్ స్థాయి ఇంగ్లీష్ రీడింగ్, మ్యాథమెటిక్స్ పోటీలు నిర్వహించారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేసి ప్రోత్సహించారు.

మిర్యాలగూడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో బుధవారం ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (బిఎల్ఆర్) ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. రోగులకు అందుతున్న వైద్య సేవలు, మౌలిక సదుపాయాలు, సిబ్బంది పనితీరును ఆయన పరిశీలించారు.

జమ్మూ కాశ్మీర్ లోని బారాముల లో గల అత్యంత శీతల ప్రాంతంలో మంచు పర్వతంపై నృత్యం చేసి అందరి ప్రశంసలు అందుకున్న ముథోల్ కు చెందిన 11 ఏళ్ల బాలిక వరేణ్యను జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి బి. పోతన్న యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.

న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెతో మిర్యాలగూడ డిపో బస్సులు డిపోలకే పరిమితం కాగా, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బస్టాండ్ వద్ద పోలీస్ బందోబస్తు కొనసాగుతోంది.

మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో బిల్లా మహేందర్ (45) అనే వ్యక్తి మృతి చెందాడు. రోడ్డుపై ఆగి ఉన్న టిప్పర్ లారీని అతని బైక్ ఢీకొనడంతో ఈ విషాదం చోటుచేసుకుంది.

సారంగాపూర్ మండల కేంద్రంలోని వివేకానంద ప్రైవేట్ పాఠశాలలో మంగళవారం వార్షికోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో విద్యార్థులు తమ ప్రతిభను వివిధ సాంస్కృతిక ప్రదర్శనల ద్వారా చాటుకున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు అర్ధరాత్రి నుంచి నిలిచిపోయాయి. తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు సమ్మె బాట పట్టడంతో రవాణా సేవలు పూర్తిగా స్తంభించాయి. దీనివల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

మిర్యాలగూడ పురపాలక సంఘం పరిధిలో ఆస్తి పన్ను వసూళ్లు, ట్రేడ్ లైసెన్సులపై కమిషనర్ జి.శ్రీనివాస్ ప్రజలకు కీలక సూచనలు జారీ చేశారు. నగర అభివృద్ధికి అవసరమైన ఆదాయ వనరులను బలోపేతం చేయడం అత్యంత అవసరమని ఆయన పేర్కొన్నారు.

మిర్యాలగూడ మండలం టిక్యాతండాలోని ట్రాన్స్ కో సబ్ స్టేషన్ లో నిర్వహించనున్న మెయింటెనెన్స్ పనుల నేపథ్యంలో, బుధవారం ఉదయం 7:00 గంటల నుండి 10:30 గంటల వరకు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోనుంది.

లక్ష్మణ్చందా మండలం వడ్యాల్ గ్రామంలో ఉపాధి హామీ పథకంలో జరుగుతున్న అవినీతిని అరికట్టాలని ఫిర్యాదు చేసినందుకు గ్రామపంచాయతీ వార్డు సభ్యుడు పుట్టి సాగర్‌పై దాడి జరిగింది. ఈ ఘటనలో అతని చొక్కా చింపేసినట్లు బాధితుడు ఆరోపించారు.

నిర్మల్ జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమాలు ప్రజల భాగస్వామ్యంతో విజయవంతంగా కొనసాగుతున్నాయని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్లో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జనాభా గణన 2027 కు సంబంధించి మొదటి విడత శిక్షణా కార్యక్రమం తానూరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (ఉర్దూ మీడియం)లో విజయవంతంగా ముగిసింది. ఈ శిక్షణలో తానూరు మండలానికి చెందిన ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లు పాల్గొన్నారు.

జిల్లాలో మొబైల్ దొంగతనాలపై నిర్మల్ పోలీసులు చేపట్టిన ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా, CEIR పోర్టల్ సహాయంతో 100 సెల్ ఫోన్లను రికవరీ చేసి, వాటిని బాధితులకు అందజేశారు. స్వాధీనం చేసుకున్న ఈ ఫోన్ల విలువ సుమారు రూ.12 లక్షలు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమాలు నిర్మల్ జిల్లాలో ప్రజల భాగస్వామ్యంతో విజయవంతంగా కొనసాగుతున్నాయని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు.

వికారాబాద్ జిల్లా మహిళా పోలీస్ స్టేషన్‌కు చెందిన ఇద్దరు మహిళా పోలీసు అధికారులు లంచం కేసులో అరెస్ట్ అయ్యారు. పోలీస్ ఇన్స్పెక్టర్ శ్రీమతి బి. సరోజ, సబ్-ఇన్స్పెక్టర్ శ్రీమతి హెచ్. రాణిలపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు క్రిమినల్ కేసు నమోదు చేశారు.