సీనియర్ నటుడు శివాజీ రాజా తండ్రి జి. రామరాజు (85) మంగళవారం ఉదయం అనారోగ్యంతో హైదరాబాద్లో తుదిశ్వాస విడిచారు.
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రామరాజు, మధురానగర్లోని తన స్వగృహంలో మరణించారు. వయోభారం, అనారోగ్యమే మరణానికి కారణాలని కుటుంబ సభ్యులు తెలిపారు.
మృతుడి అంత్యక్రియలు బుధవారం మధ్యాహ్నం మూడు గంటలకు మహాప్రస్థానంలో జరగనున్నాయి. ఈ వార్తతో శివాజీ రాజా కుటుంబం తీవ్ర దుఃఖంలో ఉంది.
రామరాజు మృతి పట్ల పలువురు సినీ పరిశ్రమ ప్రముఖులు సంతాపం తెలిపారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.
ఈ సంఘటనతో సినీ వర్గాల్లో విషాద వాతావరణం నెలకొంది.


