హయత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొహెడ గ్రామంలో ప్రేమించిన యువతి మోసం చేసిందని మనస్తాపానికి గురైన పల్లపు గోవర్ధన్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
పోలీసులు అందించిన వివరాల ప్రకారం, గోవర్ధన్ నాలుగేళ్ల క్రితం సరిత అనే యువతిని ప్రేమించి, ఇంట్లో తెలియకుండా వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక బిడ్డ కూడా జన్మించింది.
అయితే, సరిత ఇటీవల తన బిడ్డను అమ్మేసి, మరొక వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడింది. ఈ విషయం తెలుసుకున్న గోవర్ధన్, సరితను ఎంతగానో బతిమాలినా ఆమె తనతో వచ్చేందుకు నిరాకరించింది.
దీంతో తీవ్ర మనోవేదనకు గురైన గోవర్ధన్, మంగళవారం రాత్రి డ్యూటీ ముగించుకుని ఇంటికి వచ్చి, బుధవారం ఉదయం వరకు బయటకు రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. తలుపులు పగలగొట్టి చూడగా, గోవర్ధన్ ఉరి వేసుకుని విగతజీవిగా కనిపించాడు.
మరణానికి ముందు గోవర్ధన్ తన ఫోన్లో ఒక వీడియో రికార్డ్ చేసినట్లు తెలిసింది. అందులో తన ఆత్మహత్యకు కారణమైన యువతిని వదిలిపెట్టొద్దని పేర్కొన్నట్లు సమాచారం. గోవర్ధన్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అమ్మేసిన బిడ్డ ఆచూకీ ఇప్పటివరకు తెలియలేదని పోలీసులు తెలిపారు.












