ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని డోర్లి గ్రామంలో అగ్ని ప్రమాదంలో నష్టపోయిన ఏలుగు కవిత – దయాకర్ దంపతుల కుటుంబానికి మాల సంక్షేమ సంఘం తలమడుగు మండల కమిటీ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అందించింది.
ఈ నెల 15వ తేదీన జరిగిన అగ్ని ప్రమాదంలో బాధితుల నివాస గృహం ధ్వంసమై, సుమారు రూ. 2 లక్షల విలువైన ఆస్తి నష్టం వాటిల్లింది.
సంఘం సభ్యులు విరాళాలు సేకరించి, రూ. 5,000 నగదుతో పాటు రూ. 5,000 విలువైన నిత్యావసర సరుకులను బాధితులకు అందజేశారు.
ఈ సహాయ కార్యక్రమం ద్వారా ప్రమాద బాధితులకు అండగా నిలిచినట్లు సంఘం నాయకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాల సంక్షేమ సంఘం మాజీ జిల్లా అధ్యక్షుడు అల్లూరి భూమన్నతో పాటు పలువురు నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.











