లోకేశ్వరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శ్రీమతి విజయలక్ష్మి నూతన ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఇంటర్మీడియట్ బోర్డు డైరెక్టర్ శ్రీ కృష్ణాధిత్య ఆధ్వర్యంలో జరిగిన పదోన్నతి కౌన్సెలింగ్‌లో భాగంగా ఈ నియామకం జరిగింది.
2008 జూనియర్ లెక్చరర్స్ (JL) బ్యాచ్‌కు చెందిన విజయలక్ష్మి, గతంలో దిలావర్పూర్ జూనియర్ కళాశాలలో సేవలందించారు. అనంతరం నిర్మల్ బాలుర జూనియర్ కళాశాలలో జూవాలజీ లెక్చరర్‌గా పనిచేసి మంచి గుర్తింపు పొందారు.
నూతన బాధ్యతలు స్వీకరించిన అనంతరం, విద్యార్థుల సమగ్రాభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ప్రిన్సిపాల్ విజయలక్ష్మి తెలిపారు.
స్థానిక ఉపాధ్యాయులు, కళాశాల సిబ్బంది నూతన ప్రిన్సిపాల్ విజయలక్ష్మికి శుభాకాంక్షలు తెలియజేశారు.












