కుంటాల మండలం లింబా (కే) గ్రామానికి చెందిన యువకుడు ఆత్మహత్యకు పాల్పడటంతో ఆ కుటుంబం తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది. ఈ నేపథ్యంలో, కుంటాల మాజీ ఎంపీపీ జీ.వి. రమణారావు బాధిత కుటుంబాన్ని పరామర్శించి, ఆర్థిక సహాయం అందించారు.
ఇటీవల లింబా (కే) గ్రామానికి చెందిన గురుజల వినోద్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనతో ఆ కుటుంబం పెద్దదిక్కును కోల్పోయి, ఆర్థికంగా, మానసికంగా కుంగిపోయింది. కుటుంబ పోషణ, పిల్లల భవిష్యత్తుపై ఆందోళన నెలకొంది.
ఈ విషాద వార్త తెలిసిన వెంటనే, మాజీ ఎంపీపీ జీ.వి. రమణారావు మంగళవారం గ్రామానికి వెళ్లి, బాధిత కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు. వినోద్ మృతికి గల కారణాలను అడిగి తెలుసుకుని, వారిని ఓదార్చారు.
రమణారావు మాట్లాడుతూ, ఈ క్లిష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని కుటుంబ సభ్యులకు సూచించారు. తాము వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. తన వంతుగా కొంత ఆర్థిక సహాయాన్ని కూడా అందించారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు దాసరి సాయన్న, అష్టం నరేష్, దత్తూరాం పాటిల్, మనోహర్ పాటిల్, ధోల్డ్లా రమేష్, గంగారెడ్డి, ముత్యం రెడ్డి, మాధవరావు పాటిల్, రాజుఎర్రోళ్ల, అనిల్, సాయికుమార్, తాటి శివ, ధోనిగా మ రాజ్‌కుమార్, కళ్యాణ్ గజేందర్, కుమ్మరి సవిన్ తదితరులు పాల్గొన్నారు.


