సారంగాపూర్ మండలం ఆదివాసీగూడ గ్రామానికి చెందిన తర్పే శివానంద ఈ రోజు 8:40 కి అంబులెన్స్‌లో ప్రసవించారు.
ఈ రోజు ప్రొద్దున 8:40 కి, సారంగాపూర్ మండలం ఆదివాసీగూడ గ్రామానికి చెందిన తర్పే శివానందకు పురిటి నొప్పులు ఎక్కువ అవడంతో అంబులెన్స్‌లో తీసుకెళ్లారు. మార్గ మధ్యలో, డాక్టర్ గారి సూచనల మేరకు ఆమె నార్మల్ డెలివరీ చేసింది.
తర్పే శివానంద పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చారు. తల్లి తన మొదటి కాన్పులో ఆడ బిడ్డ పుట్టడం చాలా సంతోషంగా ఉందని తెలిపింది. కుటుంబ సభ్యులు కూడా అందరూ మాకు ధన్యవాదాలు తెలిపారు.
తర్వాత, తర్పే శివానందను సారంగపూర్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. హాస్పిటల్ డాక్టర్లు 108 సర్వీస్‌ను ప్రశంసించారు.
EMT పురడి సాగర్ మరియు PILOT వెలమల మహేష్ ఈ ప్రక్రియలో పాల్గొన్నారు.












