నిర్మల్ జిల్లా పోలీసులు మొబైల్ చోరీలపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి 108 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
నిర్మల్ జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల ఐపీఎస్ ఆదేశాల మేరకు ఈ డ్రైవ్ చేపట్టారు. రికవరీ ఐ ఇ ఐ ర్ పోర్టల్ సహాయంతో జరిగింది.
ఈ మొబైల్స్ విలువ రూ. 12.96 లక్షలు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో బాధితులకు ఎస్పీ స్వయంగా ఫోన్లు అందజేశారు.
అంతకుముందు, జిల్లా పోలీసులు రెండు కోట్ల డెబ్భై లక్షల రూపాయల విలువ గల మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అప్పగించారు.
ఎస్పీ డా. జి. జానకి షర్మిల మాట్లాడుతూ, మొబైల్ పోయినా చోరికి గురైనా వెంటనే http://www.ciir.gov.in వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు.












