నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం ఆదివాసిగూడ గ్రామానికి చెందిన తర్పే శివానంద అనే గర్భిణి 108 అంబులెన్స్‌లో సురక్షితంగా ప్రసవించింది.
మంగళవారం ఆమెకు పురిటి నొప్పులు రావడంతో 108 సేవలకు సమాచారం అందించారు. అంబులెన్స్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడానికి సిద్ధమయ్యారు.
మార్గమధ్యంలోనే ఆమెకు పురిటి నొప్పులు తీవ్రతరమవ్వడంతో అత్యవసరంగా 108 వాహనంలో ప్రసవం జరిగింది. సిబ్బంది సహకారంతో ఆమెకు నార్మల్ డెలివరీ జరగగా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.
తల్లి మరియు బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని అంబులెన్స్ సిబ్బంది తెలిపారు. అనంతరం వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.












